బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2016 (15:35 IST)

నయీమ్ డైరీలో మీడియా పెద్దల జాతకం.... 69 మంది జర్నలిస్టులకు నజరానాలు

హైదరాబాద్ : గ్యాంగ్‌స్ట‌ర్, కిరాతకుడు నయీం దందాల‌కు కొంద‌రు మీడియా పెద్ద‌లు కూడా స‌హ‌క‌రించ‌న‌ట్లు తెలుస్తోంది. న‌యీం రక్తపు కూడులో పలు పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన మీడియా పెద్దలు కూడా చెయ్యేసి సెటిల్‌మెంట్ల దందా నిర్వహించినట్టు ప్రాథమిక విచారణలో బ

హైదరాబాద్ : గ్యాంగ్‌స్ట‌ర్, కిరాతకుడు నయీం దందాల‌కు కొంద‌రు మీడియా పెద్ద‌లు కూడా స‌హ‌క‌రించ‌న‌ట్లు తెలుస్తోంది. న‌యీం రక్తపు కూడులో పలు పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన మీడియా పెద్దలు కూడా చెయ్యేసి సెటిల్‌మెంట్ల దందా నిర్వహించినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. రేటింగ్‌లో దూసుకుపోయే మూడు ఛానళ్లు, ఎప్పుడు మూతపడుతుందో తెలియని ఓ ఛానల్ యజమాని పేర్లను నయీం తన డైరీలో రాసుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 
 
మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పలు వివాదాస్పద భూములను ఈ నాలుగు ఛానళ్ల పెద్దల సూచనలు, సలహాల ప్రకారం సెటిల్‌మెంట్లు చేశానని, నయీం తన డైరీలో పేర్కొన్నట్టు తెలిసింది. మూసివేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ చానల్ పెద్ద ఏకంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నయీం ద్వారా భూదందా నిర్వహించినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అన్నీ కలిసొస్తే నయీమ్ కూడా ఓ ఛానల్ పెట్టేవాడ‌ట‌. ఇపుడు డామిట్... కధ అడ్డంగా తిరిగి హతుడవటంతో జర్నలిజం బ‌తికిపోయిందని ప్ర‌మాణాలు పాటించే కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.