బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 30 జులై 2016 (15:58 IST)

మృగాల కంటే నీచంగా ప్రవర్తించిన తల్లిదండ్రులు.. గొడవపడి చెరోదారిన వెళ్ళిపోయారు.. పిల్లలు రోడ్డున పడ్డారు!?

ఈ లోకంలో సంతానం కలుగలేదని ఏడ్చుకునే ఎంతోమంది దంపతులున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఆలనాపాలనా చూసుకుంటూ.. వారికోసమే జీవితాన్ని పణంగా పెట్టే ఎందరో తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వనస్థలిపురానికి చెం

ఈ లోకంలో సంతానం కలుగలేదని ఏడ్చుకునే ఎంతోమంది దంపతులున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఆలనాపాలనా చూసుకుంటూ.. వారికోసమే జీవితాన్ని పణంగా పెట్టే ఎందరో తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వనస్థలిపురానికి చెందిన ప్రసాద్, సమ్మక్కలాంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఎక్కడా కనిపించరు. ఎందుకంటే.. భార్యాభర్తల గొడవల్లో కన్నబిడ్డల్ని రోడ్డుపై వదిలి.. చెరోదారి చూసుకెళ్లిన పోయారు. తద్వారా కన్నబిడ్డలు బాలల హోమ్‌లో అనాధలుగా గడపాల్సి వచ్చింది. 
 
ఎంత గొడవలున్నా కన్నబిడ్డల్ని అటు ప్రసాద్ ఇటు సమ్మక్క ఇద్దరూ చేరదీయలేదు. అంతే ఆ పిల్లలు పోలీసుల సాయంతో బాలల హోమ్‌లో చేరిపోయారు. ఇంకా జంతువులు కూడా పిల్లలపట్ల ఎంతో మమకారాన్ని చూపిస్తాయి. సెన్స్ ఉన్న వీళ్లిద్దరూ మాత్రం నీచంగా ప్రవర్తించారని పోలీసులు ఫైర్ అవుతున్నారు.  
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ వవస్థలిపురంలో నివాసం ఉండే ప్రసాద్‌, భార్య సమ్మక్క గురువారం ఘర్షణపడ్డారు. తనమాట వినకుండా భర్త సోదరి ఇంటికి వెళ్లాడని ఆగ్రహించిన సమ్మక్క పుట్టినిల్లు అయిన వరంగల్‌ జిల్లాకు వెళ్లింది. ఇక ప్రసాద్‌, సమ్మక్క దంపతులకు శివాజీ(6), కీర్తి(9) అనే ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరూ గురువారం పాఠశాల నుంచి సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో శివాజీ, కీర్తి వసస్థలిపురం నుంచి ఘట్‌కేసర్‌ మండలం సీపీఆర్‌ఐ వరకు కాలినడకన చేరుకున్నారు. 
 
అప్పటికే అర్థరాత్రి అవుతుండటంతో అటుగా ఉద్యోగానికి వెళ్తున్న ఇన్ఫోసిస్‌ ఉద్యోగి పిల్లలను చేరదీసి ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నాలుగు గంటలు శ్రమించి ప్రసాద్‌కు ఫోన్‌ చేశారు. అయితే ప్రసాద్‌ తనకు తీరికలేదని చెప్పడంతో చేసేదిలేక చిన్నారులను బాలల హోమ్‌లో చేర్పిస్తున్నట్లు సీఐ ప్రకాష్ వెల్లడించారు. ఆ పిల్లల ఆకలిని తీర్చగలిగామని, తల్లిదండ్రులు కావాలని ఏడుస్తుంటే ఏమీ చేయలేక బాలల హోమ్‌లో చేర్పించామని సీఐ తెలిపారు.