బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2016 (15:55 IST)

ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని... ప్రియురాలి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మరో యువతి ప్రేమికుడి చేతిలో మోసపోయింది. ఆ బాధను భరించలేక ఆ యువతి అర్థాంతరంగా తనవు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్, చాంద్రాయణగుట్ట మల్లేపల్లి ఫాతిమానగర్‌కు చెందిన హసన్‌కు ఉన్నీసా (19) అనే కుమార్తె ఉంది. 
 
ఈ యువతి అదే ప్రాంతానికి చెందిన ఒమర్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ కారణంగా గత రెండేళ్లుగా వీరిద్దరు ప్రేమలో మునిగిపోయారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియటంతో ఒమర్‌ కుటుంబ సభ్యులతో చర్చించి పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంగీకరించారు. 
 
ఈ విషయం ప్రియుడికి చెప్పి, పెళ్లి చేసుకుందామని పదేపదే కోరుతున్నా.. అతను తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అతడితో ఫోన్‌లో సంభాషించింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. గురువారం ఉదయం చీరెతో ఉరేసుకుని మరణించింది. హాసన్‌ ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.