శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (16:05 IST)

జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదు : హైకోర్టు హెచ్చరిక

జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్లు దినసరి కూలీలు కాదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అందువల్ల వారు చేస్తున్న సమ్మెను విరమించుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని తేల్చిచెప్పింది. 
 
ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, జూడాలకు సమ్మె చేసే హక్కు లేదని చెప్పింది. సమ్మె చేయడానికి మీరేమీ దినసరి కార్మికులు కాదని సూచించింది. బాధ్యత గల పౌరులు చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నారని అడిగిన న్యాయస్థానం... పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ వైద్యులకు వర్తించదని పేర్కొంది. సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచిస్తూ.. ఈ పిటీషన్‌పై విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.