గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (16:09 IST)

ఎమ్మెల్యే ఇల్లూగిల్లూ జాన్తానే.. కూల్చివేయాల్సిందే : హైకోర్టు ధర్మాసనం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ ఇచ్చిన ప్లాన్‌ను అతిక్రమించి అక్రమంగా నిర్మించిన ఎమ్మెల్యే ఇంటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేయాల్సిందేనంటూ స్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ ఇచ్చిన ప్లాన్‌ను అతిక్రమించి అక్రమంగా నిర్మించిన ఎమ్మెల్యే ఇంటిని నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేయాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తగినంత సెట్బ్యాక్లతో జి+1 నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని.. 4 అంతస్తుల్లో ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించింది.
 
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి ప్లాన్ను ఉల్లంఘిస్తూ భారీవాణిజ్య సముదాయాలను నిర్మించారంటూ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సి.వి.నాగార్జున రెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు.
 
ఈ తీర్పును సవాల్‌చేస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ భవనంలో ఉన్న నారాయణ కాలేజీ యాజమాన్యానికి చెందిన కొన్ని కుటుంబాల సభ్యులు హైకోర్టు ధర్మాసనంలో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు ఆలకించి చివరకు సింగిల్ జడ్జి తీర్పునే సమర్థిస్తూ.. భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. భవనాల్లో ఉన్నవాళ్లు మూడు నెలల్లో ఖాళీ చేయాలని, 6 నెలల్లోగా కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తికావాలని హైకోర్టు ఆదేశించింది.