Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

15ఏళ్ల బాలికపై ప్రేమ పేరుతో లైంగిక దాడి.. మరో యువకుడి బ్లాక్ మెయిల్‌, అత్యాచారం..

గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:42 IST)

Widgets Magazine
rape victim

15ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తన గదికి తీసుకొచ్చి చాలాసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న స్నేహితుడు.. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బాలికను బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను హైదరాబాదులోని అమీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉమ్నాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌(21) కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మంద మల్లమ్మ చౌరస్తాలోని జహంగీర్‌ఖాన్‌కు చెందిన వెల్డింగ్‌ షాప్‌లో పని చేస్తూ ఉండేవాడు. న్యూమారుతీనగర్‌లోని జహంగీర్‌ ఇంట్లో నివాసం ఉంటూ వచ్చాడు. తొమ్మిది నెలల క్రితం అక్కడే నివసించే 15ఏళ్ల బాలికను పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
దీన్ని ఆసరాగా తీసుకున్న జహంగీర్‌.. బాలికకు సంబంధించిన ఫోటోలున్నాయని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఫోటోలు నెట్లో పెట్టేస్తానని బెదిరించాడు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయినా ఫోటోలు ఇవ్వకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయాలన్నీ చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సరస్వతీ నది ఎండిపోలేదా.. మరి మన కళ్లముందే మహానది మాయమైపోయింది కదా..

మూడు వేల సంవత్సరాల క్రితం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సరస్వతి ఉన్నట్లుండి అదృశ్యమై ...

news

ఫైర్ బ్రాండ్ రోజాను టార్గెట్ చేసిన చంద్రబాబు.. నగరి అభివృద్ధికి అడ్డం పడుతున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యే ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...

news

పార్టీలో శశికళ వాసనే ఉండకూడదు... మా ధర్మయుద్ధానికి తొలి విజయమిది: మాజీ సీఎ పన్నీర్

అన్నాడీఎంకే నుండి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె కుటుంబం దూరంకావడం తాము ...

news

సమాధి సాక్షిగా సయోధ్య.. ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్ సెల్వం? మెజార్టీ మంత్రుల సూచన!

అన్నాడీఎంకేలో వైరి వర్గాలు ఏకంకానున్నాయి. అదీ కూడా మెరీనా తీరంలోని దివంగత ముఖ్యమంత్రి ...

Widgets Magazine