Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"నన్నే అద్దె అడుగుతావే.." ఇంటి ఓనర్‌ను కొట్టిన తెరాస ఎమ్మెల్సీ

సోమవారం, 9 అక్టోబరు 2017 (11:10 IST)

Widgets Magazine
First Information Report

తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ తెరాసకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు తన జులుం ప్రదర్శించారు. ఇంటి అద్దె చెల్లించమన్నందుకు ఇంటి యజమానినే చెప్పుతో కొట్టారు. దీంతో ఆ మహిళ తక్షణం ఇల్లు ఖాళీ చేయాలంటూ ఎమ్మెల్సీ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజా ప్రతినిధిపై కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఒక ఎన్నారై మహిళ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటిని నాంపల్లి ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని ఖాళీ చేయమని ఎన్నారై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. ఈనేపథ్యంలో ఆమె నేరుగా ఎమ్మెల్సీ వద్దకెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 
 
దీంతో ఆసహనానికి గురైన ఎమ్మెల్సీ ఫరూఖ్ దిక్కున్నదగ్గర చెప్పుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అయిన తనను ఎవడు ఖాళీ చేయిస్తాడో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఆమెను చెప్పుతో కొట్టారు. దీంతో ఆమె నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 
 
దీంతో ఫారూఖ్ హుస్సేన్‌పై కేసు నమోదైంది. అద్దె చెల్లించాలని అడిగితే... తనపై దాడి చేశారంటూ ఆ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఫారూఖ్ హుస్సేన్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ మా మిత్రుడే.. కానీ పొత్తుపై తుది నిర్ణయం కల్యాణ్‌దే: పురంధేశ్వరి

భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే అంశంపై పవర్ స్టార్ పవన్ కల్యాణే నిర్ణయం తీసుకోవాలని ...

news

నేలకు చేతులు ఆనిచ్చి బొంగరంలా తిరుగుతున్న కింగ్ జాంగ్ (Video)

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అంటే బొద్దుగా ఉన్న శరీరాకృతి, విచిత్రమైన హెయిల్ స్టైల్ ...

news

'అమ్మ' గదికి నో ఎంట్రీ.. రెండో అంతస్తు వరకే పర్మిషన్.. బాంబు పేల్చిన మంత్రి

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై అధికార పార్టీకి చెందిన మంత్రులు బాంబులు పేల్చుతున్నారు. ...

news

మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...

హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. ...

Widgets Magazine