గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (14:38 IST)

గోవాలో హైదరాబాద్ గర్ల్ రేప్... ఇంటికొస్తే పెద్దవాళ్లు పెళ్లి చేయబోయారు...

హైదరాబాదు పాతబస్తీలో చాలామంది తల్లిదండ్రులు వారివారి మైనర్ బాలికల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు బాలికలను డబ్బుకు తెగనమ్ముకుంటున్నారు. తాజాగా పాతబస్తీలో ఓ కుటుంబం బడా షేక్‌కు కాంట్రాక్టు పెళ్లి పేరిట విక్రయించేసింది. ఆ షేక్ మైనర్ బాలికను గోవా తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఐతే అతడి బారి నుంచి ఆ బాలిక తప్పించుకుని ఎలాగోలా పాతబస్తీలో తన ఇంటికి చేరుకుంది. బాలిక అత్యాచారానికి గురయిందన్న విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోని పెద్దవారు ఆమెకు మరో వివాహం చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి అక్కడి నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటన వివరాలను తెలియజేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.