గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:35 IST)

హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లో మసాజ్ సెంటర్... లోపల వ్యభిచారం...

మర్దన కేంద్రాలు... మసాజ్ సెంటర్లంటే ఇప్పుడు అనుమానం కలిగే పరిస్థితి దాపురిస్తోంది. లోపల నిజంగా మసాజ్ చేస్తున్నారా.. లేదంటే అసాంఘిక కార్యకలాపాలా అనే అనుమానాలు కూడా తలెత్తే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నగరం జీవితంలో హైటెక్ జీవనశైలికి తగ్గట్లు చీకటి వ్యాపారం కూడా జరుగుతోంది. తాజాగా హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్లో మసాజ్ సెంటర్ పేరిట జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు కనుగొన్నారు. 
 
పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు ఏఎస్ రావు నగర్ పరిధిలోని మసాజ్ సెంటర్లపై మెరుపుదాడి చేయడంతో ఓ సెంటర్లో ఇద్దరు స్త్రీలు వ్యభిచరిస్తూ పట్టుబడ్డారు. వారితో ఇద్దరి విటులను మసాజ్ సెంటర్ నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీసు స్టేషనుకు తరలించారు. ఇలాంటి కేంద్రాలపై పోలీసులు ఎన్నిమార్లు దాడులు చేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు.