Widgets Magazine Widgets Magazine

హైదరాబాదీ యువతి సునీత హత్య... ప్రేమ కాటేనా...? ఐదుగురు ఆత్మహత్య, ఒకరు మర్డర్...

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (13:37 IST)

Widgets Magazine
sunitha

తన అన్న కుమార్తెలను కన్న కూతుళ్లలా సాకుతున్న హైదరాబాదీ యువతి సునీతను పట్టపగలే హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన దారుణ ఘటన మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో సంచనలం సృష్టిస్తోంది. ప్రేమికుల రోజు తర్వాతి రోజున ఆమె హత్యకు గురికావడంతో ఇది ప్రేమ కాటేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్ల సునీత బుధవారం నాడు హైదరాబాద్‌లోని మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ సర్వే నంబర్ 1007 ఖాళీస్థలంలో హత్యకు గురైంది. 
 
ఈమెది సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట. ఈమె మాన్‌స్టర్.కామ్‌లో ఇటీవలే ఉద్యోగం చేరారు. ఐతే అంతకుముందు రెండురోజులుగా ఉద్యోగానికి వెళ్లడంలేదు. మంగళవారం నాడు ఆఫీసుకని చెప్పి అక్కడికి వెళ్లలేదని దర్యాప్తులో తేలింది. బుధవారం కూడా ఆఫీసుకు వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిన సునీత మధ్యాహ్నం ఒంటిగంటకు మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ ఖాళీ స్థలంలో హత్యకు గురైంది. అక్కడికి ఆమెను ఎవరు తీసుకువచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె సిమ్ కార్డుకు ఆమె స్నేహితుడి సందేశాన్ని గుర్తించారు. ఈ సందేశం ఆధారంగా అతడితోపాటు మరొకర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
సునీత ఫ్యామిలీని చూస్తే విషాదాల పుట్టలా కనిపిస్తుంది. సునీత పేరెంట్స్ మాణిక్యరావు, జానకమ్మలకు 11 మంది సంతానంలో ఐదుగురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు. వీరిలో సునీత చిన్నమ్మాయి. విషాదకర విషయం ఏమిటంటే... ఈ కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఒకరు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లిపోయారో ఆచూకి లేదు. ఇక మిగిలింది ఐదుగురు. వీరిలో ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి. ముగ్గురికి పెళ్లి కాలేదు. ఈ ముగ్గురూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. సునీత తన సోదరుడి కుమార్తెలను చదివిస్తోంది. ఇప్పుడు ఆమె హత్యకు గురి కావడంతో ఆమెనే తల్లిగా భావిస్తూ వున్న ఆకర్షిక, రిషక అనే బాలికలు దిక్కులేని బిడ్డలుగా మారారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్యేల వాహనాలపై ఉమ్మేసి.. బూతులు తిట్టిన ప్రజలు.. రెసార్ట్‌లో తిరుగుబాటు.. పన్నీర్‌కు సపోర్ట్?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ క్యాంపు నుంచి సీఎంగా ఎంపికైన పళని స్వామికి ...

news

పోర్న్ సైట్‌లలో ఈ సైట్ వేరయా.. వీడియోల ద్వారా సెక్స్ పాఠాలు.. బిల్లు పాస్ చేయాలట..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నోటికి పనిచెప్పారు. ఎన్నికల ...

పళని స్వామి సీఎం పీఠం రేటు రూ.600 కోట్లా...? వారి పంట పండింది...

అందుకే రాజకీయాల్లో సంక్షోభాలు రావాలని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటూ వుంటారు. పాలన ...

news

పన్నీర్‌కు మద్దతుగా జల్లికట్టు తరహా ఉద్యమం.. పళనికి కష్టాలే..అప్పుడే హెచ్చరించారుగా?

తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏ రోజున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుంచి ఆమె ...