Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీడు మారడు: తెరాస కార్పొరేటర్ కొడుకు అభిషేక్ మళ్లీ అరెస్ట్

ఆదివారం, 5 నవంబరు 2017 (12:52 IST)

Widgets Magazine
abhishek gowd

హైదరాబాద్ నగర అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్, మహిళలను వేధించిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఇదే కేసులో నెలక్రితం అరెస్టు అయి ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. ఇపుడు మళ్లీ ఇదే తరహా కేసులో అరెస్టు కావడంతో వీడు మారడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
హైదరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేటర్ తెరాసకు చెందిన జగదీశ్వర్ గౌడ్ కొనసాగుతున్నారు. ఈయన సుపుత్రుడు అభిషేక్ గౌడ్ అమ్మాయిలను వేధిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం తనతో కలిసి చదువుకున్న అమ్మాయిలతోనే పరిచయం చేసుకుని, వాళ్ల ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వేధించడం మొదలుపెట్టేవాడు. 
 
దీంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు దొరక్కుండా ఉండటానికి అభిషేక్ నగరంలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఇంటర్నెట్ కాల్స్ చేసేవాడు. ఫోన్ కట్ చేస్తే… వాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. నెల క్రితమే ఓ మహిళను వేధించిన కేసులో షీటీమ్ అభిషేక్‌ను అరెస్టు చేసింది.
 
ఈ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకొచ్చాక బుద్ధిమారలేదు. అమ్మాయిల ఫోటోలను మార్ఫ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం మళ్లీ స్టార్ట్ చేశాడు. దీంతో కొందరు బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిషేక్‌ను ట్రాప్ చేసిన నాగోల్ దగ్గర అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సౌదీ అరేబియాపై షితే హుతి రెబల్స్ క్షిపణి దాడి

గల్ఫ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాపై షితే హుతి రెబెల్స్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఇరాన్ ...

news

ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ కరియప్పకు భారతరత్న?

భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం ...

news

అపుడు గడ్డి తిన్నాను సరే... ఇప్పుడు నితీశ్ ఏం తిన్నారు : లాలూ ప్రశ్న

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను గడ్డితిన్నమాట నిజమేనని ఆర్జేడీ అధినేత, బీహార్ ...

news

రోజా ఓ తింగరబుచ్చి... డ్యాన్సులు వేయడం మినహా ఏమీ తెలియదు!

వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల ...

Widgets Magazine