Widgets Magazine

సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?.. హేళన చేసిన భార్య... భర్త ఏం చేశాడు?

శనివారం, 18 మార్చి 2017 (09:41 IST)

Widgets Magazine
faction murder

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను భార్య హేళన చేసింది. అదీ కూడా అతని మగతనంపై. ఇంతకీ ఆ భర్త చేసిన తప్పేంటో తెలుసా..? పడక గదిలో భార్యను సుఖ పెట్టలేక పోవడమే. "సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?" అంటూ హేళన చేసింది. దీంతో అవమానంతో పాటు... ఆగ్రహంతో రగిలిపోయిన ఆ భర్త... భార్యను చంపేశాడు. ఆ తర్వాత గుండెపోటుతో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించి జైలుపాలయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం కూలూర్‌ గ్రామానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య (47) అనే వ్యక్తి జీవనం కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఓ బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఆ తర్వాత 1999లో సికింద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మితో అతనికి పెళ్లయింది. అయితే, ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరూ విడిపోయారు.
 
ఆ తర్వాత 2005లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాధవి(27)ని లక్ష్మయ్య వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాపిల్లలతో కలిసి హయత్ నగర్‌లో ఉంటున్నాడు. అయితే భార్య తరచూ పుట్టింటికి వెళుతుండటంతో ఆమెపై లక్ష్మయ్య అనుమానం పెంచుకున్నాడు. పుట్టింటికి మాటిమాటికి ఎందుకువెళ్తున్నావని అడిగితే, తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, నువ్వు నాకన్నా పెద్దవాడివని, సెక్స్‌ కోర్కెలను తీర్చలేకపోతున్నావని హేళన చేస్తూ వచ్చింది. 
 
హోలీ పండుగ మరుసటి రోజు లక్ష్మయ్య డ్యూటీకి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలోనూ ఆమె నువ్వు వయస్సులో పెద్దోడివి అంటూ హేళన చేసింది. దాంతో ఆమెను అట్లకాడ తీసుకుని తీవ్రంగా కొట్టాడు. కిందపడిపోయిన మాధవిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం 108కి సమాచారం ఇచ్చాడు. వారి వచ్చి పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు. గుండెపోటుతో తన భార్య చనిపోయినట్టు పోలీసులను లక్ష్మయ్య నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు లక్ష్మయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కుమార్తెను ఫణంగా పెట్టిన ఆ మాన్య కలెక్టర్

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ నాలుగు దశాబ్దాల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ...

news

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రేస్ : రాజ్‌నాథ్ సింగ్ వర్సెస్ మనోజ్ సిన్హా.. 4 గంటలకు ఫైనల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్నది శనివారం సాయంత్రం 4 గంటలకు తేలిపోనుంది. ...

news

పళనిస్వామే నన్ను మర్చిపోయాడా... విశ్వాసఘాతకుడంటూ రగిలిపోతున్న చిన్నమ్మ

బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ...

news

ఆర్కే.నగర్ బైపోల్ : నటి గౌతమికి షాకిచ్చిన బీజేపీ... ఇళయరాజా బ్రదర్‌కు టిక్కెట్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ ...