మొదటిరోజే హైదరాబాద్ మెట్రో రైల్లో ఫైన్లతో బాదుడే బాదుడు...

బుధవారం, 29 నవంబరు 2017 (21:07 IST)

hyderabad metro rail

రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ఇన్‌స్పెక్టర్లు ఫైన్లు వేస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. ఐతే బుధవారం నాడు తెలంగాణలో ప్రారంభమైన మెట్రో రైలులో ప్రయాణికులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. రైలెక్కి దిగగానే ఎదురుగా ఫైన్ కట్టు అంటూ టికెట్ కలెక్టర్స్ ప్రత్యక్షమవడంతో షాక్ తిన్నారు. 
 
ఇలా ఎందుకు జరిగిందయా అంటే... మెట్రో రైల్లో నాగోల్ లేదంటే ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లాలనుకునేవారు అమీర్ పేటకు వెళ్లి అక్కడి నుంచి మరో ట్రైన్లో ఎక్కాలి. ఒకవేళ ఉప్పల్ నుంచి మియాపూర్ వరకూ ఒకటే టిక్కెట్ తీసుకున్నప్పటికీ అమీర్ పేటలో దాన్ని మార్చుకుని వెళ్లాలి. ఇది తెలియక చాలామంది అలాగే రైల్లో ఎక్కేశారు. ఇంకేముంది... వారు మియాపూర్లో దిగగానే ఫైన్లతో అధికారులు బెంబేలెత్తించారు. ఈ పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్కే నగర్ బైపోల్ : 184వ సారి బరిలో 'ఎలక్షన్‌ కింగ్'

సాధారణంగా ఎన్నికల్లో ఒకటి రెండు సార్లు మహా అయితే ఐదారు సార్లు పోటీ చేసి విరమించుకుంటారు. ...

news

రాహుల్ గాంధీ హిందువు కాదా?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదానికి తెరతీశారు. దీనికి కారణం కూడా ఆయనే. ఇదే ...

news

ఇందిరా గాంధీ ముక్కు మూసుకున్నారు : ప్రధాని నరేంద్ర మోడీ

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీపై ...

news

విద్యార్థుల ఆత్మహత్యలకు కళాశాలలదే బాధ్యత : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సంబంధిత కళాశాల యాజమాన్యమే బాధ్యత ...