గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (14:18 IST)

హైదరాబాద్.. తెలంగాణ రాజధాని మాత్రమే కాదు.. దేశంలో ఓ ముఖ్య నగరం : ప్రణబ్

హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణా రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదనీ.. దేశంలోని ఉన్న ముఖ్య నగరాల్లో అది ఒకటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అందువల్ల హైదరాబాద్ నగరాన్ని కేవలం తెలుగు ప్రజలే కాకుండా, దేశ ప్రజలంతా ఇష్టపడతారన్నారు. తనకు కూడా అమిత ఇష్టమన్నారు. 
 
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు రచించిన "ఉనికి" పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలసి పనిచేయాలని కోరారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఎవరినీ వదులుకోకూడదని, కలసి ఉంటే మరింత వేగంగా అభివృద్ధి చెందవచ్చని పిలుపునిచ్చారు. 
 
హైదరాబాద్ తెలంగాణకు రాజధాని మాత్రమే కాదని, దేశంలోని ఓ ముఖ్యపట్టణమన్నారు. హైదరాబాద్ ఓ గొప్ప నగరం, దేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతమన్నారు. ముఖ్యంగా మతసామరస్యానికి ప్రతీక అన్నారు. ఈ నగరం అంటే దేశ ప్రజలందరికీ ఎంతో ఇష్టం.. నాకు కూడా అని చెప్పారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా ఐటీ, విద్యారంగానికి హబ్‌గా నిలిచింది గుర్తు చేశారు. నగరానికున్న ప్రాముఖ్యత, స్నేహపూర్వక వాతావరణం చెడకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే అని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు.