శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (11:25 IST)

హైదరాబాద్‌లోకుళ్ళిన మాంసంతో బిర్యానీ వండుతున్నారు: 15 రోజులు నిల్వచేసి? బీకేర్ ఫుల్..!

బిర్యానీ సెంటర్లు, హోటళ్లలలో లొట్టలేసుకుని తినే బిర్యానీ ప్రియులకు చేదువార్త. హైదరాబాద్ అంటే ఘుమ ఘుమలాడే బిర్యానీ రుచులు గుర్తుకు వస్తుంటాయి. కానీ కొన్ని రెస్టారెంట్లలో బిర్యానీ నాణ్యత క్షీణించింది.

బిర్యానీ సెంటర్లు, హోటళ్లలలో లొట్టలేసుకుని తినే బిర్యానీ ప్రియులకు చేదువార్త. హైదరాబాద్ అంటే ఘుమ ఘుమలాడే బిర్యానీ రుచులు గుర్తుకు వస్తుంటాయి.  కానీ కొన్ని రెస్టారెంట్లలో బిర్యానీ నాణ్యత క్షీణించింది. కొన్ని బిర్యానీ సెంటర్లలో తినేటప్పుడు జాగ్రత్త పడాలి అంటున్నారు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఇన్ స్పెక్టర్లు.

హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో ఉన్న గ్రీన్ బావర్చీ రెస్టారెంట్‌పై మల్కాజిగిరి జీహెచ్ఎంసీ హెల్త్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక దాడులు చేస్తే దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పది పదిహేను రోజులు నిల్వ చేసి ఉంచిన కుళ్లిన మాంసంతో బిర్యానీ వండుతున్నారని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
 
పదిరోజులుగా నిల్వచేసి కుళ్లిపోయి వాసవ వస్తున్న మాంసంతోనే బిర్యానీ తయారు చేసి సర్వ్ చేస్తున్నారని రైడ్‌లో తేలింది. దీంతో అధికారులు గ్రీన్ బావర్చీ హోటల్‌కు పదివేల రూపాయల జరిమానా విధించారు. అనారోగ్యకరమైన నిల్వ ఉంచిన మాంసంతో బిర్యానీ వండారని అధికారులు తేల్చారు.

మాంసం నిల్వచేసిన ప్రదేశం కూడా అపరిశుభ్రంగా ఉందని, కుళ్లి కంపు కొడుతున్న మాంసంతో బిర్యానీ వండుతున్నారని మల్కాజిగిరి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో అక్రమంగా ఉన్న పశువధశాలకు అధికారులు సీలు వేశారు.