Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొండ గుట్టవైపు తెలిసిన వ్యక్తితోనే చాందినీ... సీసీ టీవీలో స్పష్టం...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (20:01 IST)

Widgets Magazine
chandini

హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని చాందినీ జైన్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై హైదరాబాదు శివార్ల లోని అమీన్ పూర్ కొండల్లో శవమై తేలింది. ఆమెను హతమార్చిన వారి ఆచూకి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిపై అనుమానం వున్నట్లు పోలీసులు చెపుతున్నారు. 
 
ఇదిలావుంటే ఆరోజు చాందిని ఎటు వెళఅలిందన్న దానిపై సిసి టీవీ ఫుటేజిలను చూడగా... ఇంటి నుంచి వెళ్లేటపుడు ఆమెతోపాటు ఆటోలో ఓ వ్యక్తి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అమీన్ పూర్ గుట్టలవైపు చాందినితో పాటు ఓ వ్యక్తి కలిసి వెళ్లడం సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయింది. ఆ వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు వేట మొదలుపెట్టారు. 
 
అమీన్‌ పూర్ గుట్ట అనేది మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా పేరుంది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచే తాగుబోతులు, ఇంకా ఇతర అసాంఘిక కార్యక్రమాలతో తూగిపోతుంటారనే పేరుంది. ఇక సాయంత్రమైందంటే పరిస్థితి మరింత తీవ్రంగా వుంటుంది. అలాంటి చోటుకి చాందినిని ఆ వ్యక్తి తీసుకుని వెళ్లాడంటే ముందుగానే ఓ పథకం ప్రకారం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా చాందిని మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె తల, మెడపై తీవ్ర గాయాలున్నట్లు తేలింది. ఆమె చెంపలపై కొరికినట్లు పంటి గాట్లు కూడా స్పష్టంగా వున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం చాందినీ జైన్ పోస్టుమార్టం ముగిసింది. చివరిసారిగా చాందినీ నలుగురు స్నేహితులకు ఫోన్లు చేసింది. వీరిలో ఇద్దరిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా చాందిని కాంటాక్ట్స్‌లో 'మై హాట్ ఫోన్ నెంబర్' అనే ఫోన్ నెంబరుతో ఆమె ఎక్కువగా సంభాషణలు చేసినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పీకేశారు... సొంత పార్టీ యోచనలో దినకరన్...

పళణిస్వామి, పన్నీరుసెల్వం చేతిలో దారుణంగా దెబ్బతిని అన్నాడిఎంకే పార్టీ నుంచి ...

news

ఆ ఒక్కటితప్ప జయలలిత అధికారాలన్నీ నమ్మినబంటుకే...

ఒక్క పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి మినహా ముఖ్యమంత్రి దివంగత జయలలితకు ఉన్న అధికారాలన్నీ ఉప ...

news

RGinUS : ప్రధాని అభ్యర్థిగా నేను సిద్ధం... రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ...

news

ఢిల్లీలో ప్రతి 10 మంది డ్రైవర్లలో ముగ్గురు అంధులేనట...

దేశ రాజధాని ఢిల్లీలోని డ్రైవర్లలో 30 శాతం మంది అంధులేనట. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు ...

Widgets Magazine