హైదరాబాదులో ఆమె నృత్యానికి ఇవాంకా ట్రంప్ ఫిదా...

గురువారం, 30 నవంబరు 2017 (20:45 IST)

Ivanka Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకు హైదరాబాద్ లో ఒకటే ఒకటి బాగా నచ్చిందట. తన పర్యటనలో తాను మరిచిపోలేనిది ఒకటేనని అదే ఒక వ్యక్తని ట్వీట్ కూడా చేసిందట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవాంకా ట్వీట్ పైనే చర్చ జరుగుతోంది. అదెవరో కాదు ప్రముఖ నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి. పారిశ్రామిక వేత్తల సదస్సులో మాధవి నృత్యం ఇవాంకను చాలా బాగా ఆకట్టుకుంది. 
 
మాధవి ప్రదర్సన తరువాత ఇవాంకా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆమె ఎవరని స్వయంగా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఇవాంకా. ఒక నటుడితో పాటు మరో రచయిత కుమార్తె మాధవి అని చెప్పడంతో ఆనందంతో ఇవాంకా ఆమెకు ఫిదా అయిపోయారట. ఒడిస్సి, కూచిపూడి, మణిపురి, భరతనాట్యం ఇలా మాధవి చేసిన నృత్య ప్రదర్సన ఇవాంకను ఆశ్చర్యపోయేలా చేసింది.
 
దీంతో ఇవాంకా మాధవి నృత్య ప్రదర్సనను డివిడి చేసి ఇమ్మని నిర్వాహకులను కోరింది. మాధవితో నేరుగా మాట్లాడకపోయినా..ఆమె చేసిన నృత్య ప్రదర్సన తీసుకెళ్ళడం మాత్రం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. విషయం కాస్త మాధవికి తెలియడంతో ఎంతో ఆనందాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా 15రోజుల క్రితం నిర్వాహకులు నాకు చెప్పారు. అంత మంది ప్రముఖుల ముందు నృత్యం చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా నేర్చుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందంటూ మాధవి ట్వీట్ చేశారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమన్నదా? ఏపీ సీఎం అలా ఎందుకన్నారు?

కేంద్రానికి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెరుగుతుందా లేదంటే ఏదైనా చిన్న తేడా కారణంగా ఇలా ...

news

అమ్మాయిలు వద్దు... అనుకున్నవారు ఆ ఊయలలో వేస్తే చాలు...

అమరావతి : ఆడపిల్ల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో ఊయల పథకం ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ విప్ ...

news

పాదయాత్ర : జగన్ మోహన్ రెడ్డి, రోజా పాదాలు ఇలా అయ్యాయి(ఫోటోలు)

ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా ...

news

దేశాభివృద్ధి కోసం రాజకీయ భవిష్యత్‌ను త్యాగం చేస్తా : నరేంద్ర మోడీ

దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ...