గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (10:26 IST)

ఆగస్టులో సింగపూర్‌కు కేసీఆర్ : పెట్టుబడులే టార్గెట్!

పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర తొలి కే చంద్రశేఖర రావు వచ్చే నెలలో సింగపూర్ వెళ్లనున్నారు. ఆయనను ఐఐఎం పూర్వ విద్యార్థులు ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఆయన వివిధ దేశాల నుండి కార్యక్రమానికి హాజరయ్యే ఐఐఎం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో, సింగపూర్‌లో జరిగే ఇంపాక్ట్ 2014లో పాల్గొనేందుకు కేసీఆర్ వెళ్లనున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులు, కార్పొరేట్ ప్రముఖలు, సింగపూర్ ప్రధానమంత్రి, ప్రభుత్వ అధికారులు హాజరయ్యే సమావేశంలో కేసీఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అభివృద్ధి విజన్, పారిశ్రామిక రంగంలో తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వివరిస్తారు. ఆగస్టు 22, 23 తేదీల్లో సింగపూర్‌లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరగనుంది. 
 
ఈ సదస్సులో ఆసియా వ్యాప్తంగా అభివృద్ధికి గల అవకాశాలపై చర్చిస్తారు. దేశంలో ఈ ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రెండు మూడు రోజుల పాటు సింగపూర్‌లో ఉండి అక్కడి ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆ దేశం తీసుకున్న చర్యలను పరిశీలిస్తారు.