మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (10:15 IST)

మహిళల పసుపుతాళ్లు తెగుతూ ఇబ్బందుల్లో ఉంటే..?: మధుయాష్కీ

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారె ఎంపీ కవితపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 110 ఎకరాల జాగీరు ఏర్పాటు చేసుకుంటే, కవిత లాక్మే షోరూంలు పెట్టుకుందని, హరీష్ రావు ఆంధ్రావాళ్లతో కలిసి ద్విచక్రవాహన వ్యాపారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
 
తెలంగాణలో కుటుంబాల్లో మహిళల పసుపుతాళ్లు తెగుతూ ఇబ్బందుల్లో ఉంటే కవిత మాత్రం బతుకమ్మ ఆడుతూ ఊరూరా తిరుగుతోందని గౌడ్ చెప్పారు. పాలనలో భాగమైన కవిత రైతులను ఆదుకోకుండా, తన సంస్థ ద్వారా డబ్బులు సేకరించి రైతు కుటుంబాలకు పంచుతానని తెలిపారు. 
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే రైతులను ఆదుకోవడం ప్రభుత్వానికి చేతకాదని కవిత పరోక్షంగా చెబుతోందా? అని మధుయాష్కీ చెప్పారు. తెలంగాణ అమర వీరుల శవాలపై పేలాలు ఏరుకున్న కవిత, ఇప్పుడు రైతు ఆత్మహత్యలతో వసూళ్లకు పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం మొత్తం వసూళ్లకు పాల్పడిందని పేర్కొన్నారు.