బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (17:18 IST)

ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ పంచడం తప్ప మరేమీ పట్టదు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుందని.. దీనిని చూస్తున్న కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచట్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ పంచడం తప్ప కాంగ్

తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుందని.. దీనిని చూస్తున్న కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచట్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ పంచడం తప్ప కాంగ్రెస్ నేతలకు మరేమీ పట్టదని విమర్శించారు. దేశంలో ఏ ప్రభుత్వానికి రాని సూపర్ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని.. కానీ ఇకపై 40ఏళ్ల పాటు ఆ పార్టీని దేశ ప్రజలు అధికారంపై కూర్చుండబెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ జోస్యం చెప్పారు. 
 
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసుకుందని.. సంక్షేమాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోసమే శతవిధాలా ప్రయత్నించిందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఇంకా సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో సీఎంలకు సంచులు మోసిన బతుకులు మీవంటూ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి అడుగడుగునా అడ్డుకుంటున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.