శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:21 IST)

తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్!!

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు హరగోపాల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనని, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదని వారు హితవు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో మరో ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు.