శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:08 IST)

కుటుంబ సమేతంగా సమగ్ర సర్వేలో పాల్గొన్న సీఎం కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సమేతంగా సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సర్వే అధికారులు ఆయన వద్దకు వెళ్లినప్పుడు కుటుంబ సమేతంగా ఆయన హాజరై వివరాలన్నీ ఇచ్చారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ ,పంచాయతీ రాజ్ శాఖల మంత్రి తారకరామారావు , ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందజేశారు. 
 
కేసీఆర్ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. నందినగర్‌లో ఇల్లు, ఎర్రవల్లిలో ఫాంహౌస్ డాక్యుమెంట్ల వివరాలను కేసీఆర్ తెలియచేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్ధంగా అందించడం కోసమే ఈ సర్వే అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు టి మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో కుటుంబ సమేతంగా కూర్చుని వివరాలు అందించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ కూడా సర్వే వివరాలు సేకరించే కృషిలో పాల్గొన్నారు. 
 
మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తోన్న సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.