శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:34 IST)

తెలంగాణలో అమెరికా కంపెనీల పెట్టుబడులు..!

అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డి రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
 
ఈ సందర్భంగా వారు విద్యుత్, వ్యర్థజలం టెక్నాలజీపై తాము చేస్తున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా వ్యర్థజలాన్ని పునర్వినియోగించేలా తీర్చిదిద్దడం, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వారు తమ ఆసక్తిని సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. వీటితో పాటు గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయగల సాంకేతిక సామర్థ్యం కూడా తమ సంస్థలకు ఉందని వారు వివరించారు.