బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (14:49 IST)

సీఎం కేసీఆర్‌కు కొత్త ఇల్లెందుకు...? డబ్బు వృధా చేస్తున్నారు... కోదండరాం సెగ

మొన్ననే అట్టహాసంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నివాసంలోకి ప్రవేశించారు. ఆ ఇంటికి సంబంధించిన వైభవం దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ముఖ్యమంత్రి కొత్త ఇల్లుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. ఐతే వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణ

మొన్ననే అట్టహాసంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నివాసంలోకి ప్రవేశించారు. ఆ ఇంటికి సంబంధించిన వైభవం దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ముఖ్యమంత్రి కొత్త ఇల్లుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. ఐతే వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రి కొత్త ఇల్లుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
రైతు సమస్యలపైన ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వెళుతోందనీ, రైతులు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రికి కొత్త నివాసం అవసరమా అని ప్రశ్నించారు. కొత్త ఇళ్లు కావాలనుకుంటే ముఖ్యమంత్రికి ప్రభుత్వ భవనాలు చాలా ఉన్నాయి కదా అని అన్నారు. ఆ ప్రభుత్వ భవనాల్లో తనకు ఇష్టమైనది ఏదో ఎంపిక చేసుకుంటే సరిపోయేదనీ, అలా కాకుండా ఇలా ప్రజా ధనాన్ని వృథా చేయడం సరికాదని పేర్కొన్నారు. 
 
మరో చురక ఏమిటంటే... 8 ఎకరాల్లో సీఎం కొత్త ఇల్లు నిర్మాణం ప్రారంభిస్తే అది ఏడాది లోపుగానే పూర్తయిందనీ, పేదలకు నిర్మించి ఇస్తామన్న ఇళ్లు మాత్రం ఏళ్లకు ఏళ్ల కాలం పడుతుందన్నదే. మొత్తమ్మీద కోదండరామ్ మెల్లగా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టేందుకు సిద్ధమవుతున్నారన్నమాట.