శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (13:17 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరేంబాగోలేదు : కోదండరాం కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరేంబాగోలేదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కామెంట్స్ చేశారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఆందోళనకు గురి చేస్తోందన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సంబంధాలు పెట్టుకుంటేనే లబ్ధి ఉంటుందన్న ఆయన... కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు నెరపకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఏపీ పాలకులే కారణమని కోదండరాం ఆరోపించారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రా పాలకులు పట్టుకుపోయారని ఆరోపించారు. 
 
అదేసమయంలో తెలంగాణాలో విద్యుత్ కష్టాలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా తన వంతు కృషి చేయాలని సూచించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలని కోదండరాం కోరారు. అలాగే, తెలంగాణ జూనియర్ డాక్టర్ల సమ్మెను కూడా ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.