ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డ్... కొండగట్టు ప్రమాదంలో మృతి

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:43 IST)

ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే మాట మనకు తెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డ డ్రైవర్ శ్రీనివాస్ ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ సర్కారు ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఐతే విధి వక్రీకరించి ఆయన ఈరోజు కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందారు.
 
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 60 మంది ప్ర‌యాణికుల‌తో శ‌నివారంపేట నుంచి బ‌స్సు బ‌య‌లుదేరింది. ఈ కొండగట్టు ఘాట్ రోడ్డులో వెళుతుండగా, మ‌రో నిమిషంలో ప్ర‌ధాన ర‌హ‌దారిపైకి చేరుకునే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పింది. 
 
అదేసమయంలో ప్ర‌యాణికులంతా డ్రైవ‌ర్ వైపు ఒర‌గ‌డంతో బ‌స్సు బోల్తా ప‌డింది. కొండ‌గ‌ట్టులో ద‌ర్శ‌నం ముగించుకుని జ‌గిత్యాల వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల్లో మ‌హిళ‌లు, ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 60మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. 
 
ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. 

తిరుమల బ్రహ్మోత్సవాలు... తిరుమలకు నిమిషానికో బస్సు...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి ...

జనసేన పార్టీ తొలి అభ్యర్థి పేరు వెల్లడి.. పవన్ కాదు.. ఇంకెవరు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీ ...

రైలు వాష్‌రూమ్‌లో ఆత్మహత్య.. వేలాడుతూ కనిపించాడు..

రైళ్ల వాష్‌రూమ్‌లు కూడా ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. తాజాగా మదురై- కాచిగూడ ...

చికెన్ షాపు నుంచి ఇంటికొచ్చిన భర్త.. ప్రియుడి పక్కలో భార్య... కళ్లారా చూసి ఏం చేశాడంటే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనకుకాకుండా మరో వ్యక్తికి పడక సుఖం ఇస్తున్నపుడు ...