గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2016 (20:38 IST)

కొత్తపల్లి గీత వ్యవహారం... టి.సర్కారు లాగితే చంద్రబాబు పరువు పోతుందా...?

ఆమె గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి. ఆ తర్వాత తెదేపాలోకి జంప్ జిలాని. ఆమే అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఈమెపై ఉన్న ఆరోపణలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఆమెపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన స్థలాలున్న శేరిలింగ

ఆమె గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి. ఆ తర్వాత తెదేపాలోకి జంప్ జిలాని. ఆమే అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఈమెపై ఉన్న ఆరోపణలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఆమెపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన స్థలాలున్న శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్‌మక్తా సర్వే నంబర్ 83లో విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఆమె దొంగ పత్రాలు సృష్టించారని ఆరోపణలున్నాయి. 
 
అంతేకాదు ఆ పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రూ. 25 కోట్లు రుణం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే ఆ భూమి తనదేనంటూ ఆమె వాదిస్తున్నారు. దీనిపై వివాదం అలా జరుగుతూ ఉంది. ఐతే తన పట్ల తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందంటూ ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదే ఇప్పుడు ఆమెకు తంటాలు తెచ్చినట్లు సమాచారం. తెలంగాణ సీఎం ఆమె వ్యవహారంపైన మండిపడుతున్నట్లు సమాచారం. 
 
భూ కబ్జాలే కాకుండా దానిపై దర్యాప్తు జరుగుతుండగా ప్రభుత్వాన్ని ఎదురుతిరిగి ప్రశ్నించడమేమిటి... అసలు కొత్తపల్లి గీత ఆక్రమించినట్లు ఆరోపణలున్న ఆ భూమి, అక్రమాల గురించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ అదే కనుక జరిగితే, ఆమెకు సంబంధించిన ఆస్తులు, అసలు వాస్తవాలు ఏమిటో వెలికి తీయాల్సిందే కేసీఆర్ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పరువు సమస్యగా మారుతుందంటున్నారు. ఒకవేళ గీత అక్రమాలు నిజమే అని తెలిస్తే ఏపీ సీఎం చంద్రబాబు మరీ ఇరకాటంలో పడిపోవడం ఖాయమంటున్నారు.