Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యూటీషియన్ శిరీష పెదవులపై పంటిగాట్లు, ఎస్సై రేప్ చేశాడా? ఆరోజు రాత్రి ఏం జరిగింది?

బుధవారం, 14 జూన్ 2017 (18:31 IST)

Widgets Magazine

హైదరాబాద్ షేక్‌పేట్‌లో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వివాదంపై శిరీష టీమ్ కుకునూరుపల్లి ఎస్సై వద్దకు వెళ్లారు. ఆ క్రమంలో వారు అక్కడ మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గొడవలు జరిగినట్లు సమాచారం. 
sirisha-prabhakar
 
ఆ పంచాయతీ తెల్లవారు జాము 3 గంటల వరకూ జరిగినట్లు తెలుస్తోంది. అదలా సాగుతుండగానే ఎస్సై మద్యం మత్తులో శిరీషపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేని శిరీష తిరుగు ప్రయాణంలో కారులో నుంచి దూకేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఐతే చివరికి ఆమె తన కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని శిరీష తన స్నేహితురాలితో పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీషతో పాటుగా కుకునూరుపల్లి వెళ్లిన రాజీవ్, శ్రావణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి కీలక సమాచారం రావడంతో, ఇందులో ఎస్సై దోషిగా నిలబడక తప్పదని తేలడంతో ప్రభాకర్ రెడ్డి భయంతో తన సర్వీస్ రివాల్వరుతో సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.
 
మరోవైపు శిరీష మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఆమె పెదవులపై, మెడపై పంటిగాట్లు వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పడం చూస్తుంటే అది హత్యేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌, అతడి స్నేహితుడు శ్రావణ్ పాత్ర ఏమిటన్నది తేలాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోయంబత్తూర్ సెంట్రల్ జైలులో మావో ఖైదీకి పెన్ డ్రైవ్.. దాన్నిండా బూతు వీడియోలే..

కోయంబత్తూరు సెంట్రల్ జైలు అధికారులు ఓ మావోయిస్టు ఖైదీ వద్ద వుంచుకున్న పెన్ డ్రైవ్ చూసి ...

news

బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. హత్యా, ఆత్మహత్యా?

బంజారాహిల్స్‌లో ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ...

news

సీటు ఇప్పిస్తానని.. కదిలే రైలులో క్యాటరింగ్ రూమ్‌లో అత్యాచారం చేసిన రైల్వే ఉద్యోగి..

కదిలే రైలులో 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రైల్వే ఉద్యోగి. ఎక్స్‌ప్రెస్ ...

news

వేరొక మహిళతో తండ్రి రాసలీలలు.. కూతురు రాసలీలలను రికార్డు చేసి?

తండ్రి కుటుంబాన్ని కాపాడుతాడనుకున్నాడు. అయితే కుటుంబాన్ని లెక్కచేయలేదు. తల్లిని ...

Widgets Magazine