తెలంగాణ టీడీపీకి మరో షాక్.. పాలమూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజీనామా

బుధవారం, 1 నవంబరు 2017 (10:46 IST)

tdp logo

తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మహబూబ్ నగర్ టీడీపీ అధ్యక్షుడు ఉదయ్ చందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది.
 
టీ టీడీపీ ఫైర్‌‍బ్రాండ్ ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెల్సిందే. దీంతో ఆయన వెంట అనేక మంది సీనియర్ నేతలు నడిచారు. ఈ కోవలో ఉదయ్ చందర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌ద్వారా పంపించారు. 
 
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ ప్రజాసమస్యలపై పోరాడానని లేఖలో పేర్కొన్నారు. తొర్రూరు, పెద్ద వంగర, డోర్నకల్‌ మండలాలకు చెందిన తెదేపా ముఖ్య నాయకులు, వివిధ గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు నరేందర్‌రెడ్డి వెంట నడవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వల్ల స్థానికంగా పార్టీని నిలబెట్టుకుని ప్రజాప్రతినిధులను గెలుపించుకోలేని పరిస్థితులు ఉన్నాయని స్పష్టంచేశారు. అందుకే పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మొదట శోభనం.. తర్వాత గర్భం... ఆ పిమ్మటే వివాహం.. ఎక్కడ?

సాధారణంగా పెళ్లి అనేది ప్రతి యువతీ యువకుడి జీవితంలో జరిగే మరిచిపోలేని మధురమైన వేడుక. ...

news

మ్యాన్‌హట్టన్‌‌లో ఉగ్రపంజా : అల్లాహో అక్బర్ అంటూ....

అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్‌హట్టన్ నగరంపై ఉగ్రవాదులు మరోమారు విరుచుకుపడ్డారు. ఓ ...

news

'నిర్భయ' దోషులను ఎందుకు ఉరితీయరు?

గత యూపీఏ సర్కారు పాలనలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ...

news

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం నాదే, నేను మొఘల్ వారసుడిని?: యాకుబ్

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం తనదేనని యాకుబ్ హబీబుద్ధీన్ అనే వ్యక్తి మీడియా ముందుకు ...