శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (09:59 IST)

మెదక్‌లో టీఆర్ఎస్ ఫస్ట్.. కాంగ్రెస్ సెకండ్.. నందిగామలో టీడీపీనే..!

రాష్ట్రంలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముందుగా ఊహించినట్టుగానే మెదక్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా, ఈ ఉప ఎన్నికల్లో సైతం నరేంద్ర మోడీ పవనాలు ఇక్కడ వీయలేదు. ఫలితంగా బీజేపీ - టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 
 
మరోవైపు నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ముందంజలో ఉన్నారు. ఈమె ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థిపై 33 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ముందంజలో దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి 19,700 ఓట్ల పైచిలుకు ఆధిక్యం సాధించారు. సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక సెగ్మెంట్ల పరిధిలో ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లుతున్నారు.