శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2015 (09:20 IST)

సంఘవిద్రోహక శక్తులు లేరు.. పోలీసులు జాగ్రత్తగానే ఉన్నారు.. : నాయిని

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా సంఘ విద్రోహక శక్తులు లేరనీ, పోలీసులు చాలా జాగ్రత్తగా, పటిష్టంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహా రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కిమ్స్ ఆసుపత్రిలో గాయపడ్డా సిఐ మొగిలయ్య, హోంగార్డును పరామర్శించారు. నేరగాళ్ల పట్ల తమ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతోనే దుండగులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 
 
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే.  పరామర్శ తరువాత నాయిని విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.