శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (14:28 IST)

మెదక్ రైలు ప్రమాద దుర్ఘటనపై నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి!

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన స్కూల్ విద్యార్థుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాక్షించారు. 
 
కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాద వార్త తెలిసింది. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా మోడీ రైల్వే శాఖ మంత్రి సదానందగౌడను ఆదేశించారు. 
 
మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ  ప్రైవేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.