బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (20:05 IST)

రెండో తరగతి బాలికను బాత్రూంలో బంధించి... 9వ తరగతి స్టూడెంట్స్

తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్‌గిరి కార్పొరేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. రెండో తరగతి చదివే బాలికను బాత్‌రూంలో బంధించి ఆమె పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించారు. ఇది చాలక దాన్ని మొబైల్ ఫోనులో వీడియో తీసి యూ ట్యూబులో పెట్టి వికృత చేష్టలు చేశారు. బాలికతో వారు చేసిన వికృత చేష్టలు యూ ట్యూబులో చూసిన పేరెంట్స్ అవాక్కయ్యారు. స్కూల యాజమాన్యాన్ని నిలదీశారు. వికృత చేష్టలు చేసిన బాలురను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
కాగా పిల్లల ప్రవర్తన ఇలా తయారు కావడానికి ఇంటర్నెట్ చెత్తేనని బాలల హక్కుల సంఘం ఆరోపిస్తోంది. మరోవైపు పిల్లలు ఎలా పెరుగుతున్నారు... వారి ప్రవర్తన ఎలా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు ధ్యాసే ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. పిల్లలపై గాడ్జెట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, చిన్న వయసులోనే ఇంటర్నెట్ ద్వారా వయసుకు మించిన విషయాలను తెలుసుకోవడం వల్ల పిల్లలిలా పెడదోవ పడుతున్నారనీ, దీనిని తల్లిదండ్రులు గమనించాలని అంటున్నారు.