బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (11:26 IST)

ప్లాస్టిక్ బియ్యంపై తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ.. ఆ వార్తలన్నీ నమ్మొద్దు..

ప్లాస్టిక్ బియ్యంపై తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ జరిగింది. గత మూడు రోజుల పాటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్లాస్టిక్ రైస్‌పై ఎడతెగని చర్చ సాగుతోంది. మోర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నట్ల

ప్లాస్టిక్ బియ్యంపై తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ జరిగింది. గత మూడు రోజుల పాటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్లాస్టిక్ రైస్‌పై ఎడతెగని చర్చ సాగుతోంది. మోర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో మీడియా కాస్త ప్లాస్టిక్ వివాదాన్ని కొండంత చేసింది. ఇంకా సోషల్ మీడియాలోనూ ప్లాస్టిక్ బియ్యంపై నానారకాల వీడియోలు, వార్తలు దర్శనమిచ్చాయి.  
 
ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళ వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని, పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రూమర్లు వస్తున్న ప్రాంతాల్లోంచి సేకరించిన బియ్యాన్ని ప్రాథమికంగా పరీక్షించగా ప్లాస్టిక్ రైస్ ఆనవాళ్లు లేవన్నారు. 
 
సేకరించిన బియ్యాన్ని మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని.. అక్కడి నుంచి నివేదిక రాగానే మరోసారి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్లాస్టిక్ బియ్యం వార్తలు రాగానే పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంటనే రాష్ట్రంలోని అన్ని గోడౌన్లు, రైస్ మిల్లులపై దాడిచేసి శాంపిళ్లు సేకరించినట్టు ప్రభుత్వ సర్కారు తెలిపింది.