శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (18:59 IST)

యాదగిరి గుట్టపై ప్రేమికుల 'ఆ' కార్యక్రమాలు.. పోలీసులకు అడ్డంగా దొరికారు!

తెలంగాణ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి గుట్టపై యువకులు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ఏకంగా శృంగార కార్యకలాపాలు సాగిస్తూ పోలీసులకు అడ్డంగా పట్టుబడుతున్నారు. ఈ చర్యలు సాధారణ భక్తులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. 
 
ఇటీవలి కాలంలో గుట్టపై అశ్లీల చర్యలు హెచ్చుమీరిపోయిన విషయం తెల్సిందే. దీంతో గుట్టను పవిత్రంగా ఉంచే చర్యల్లో భాగంగా గత కొన్ని నెలలుగా పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే డీఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం లాడ్జీల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆరు ప్రేమ జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ యాదగిరిగుట్ట వద్ద ఇటువంటి కార్యకలాపాలను అనుమతించబోమని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.