శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : మంగళవారం, 26 మే 2015 (18:17 IST)

మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం... ఐదుగురు అరెస్టు..

మసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు పోలీసులు ఏఎస్ రావు నగర్‌లోని ఓ సెంటర్‌పై అకస్మాత్తుగా దాడి చేశారు. 
 
ఆ సమయంలో ఒక మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు విటులు, మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.