Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యాలెట్ పేపర్ ఎక్కడ వేయాలో తెలియని తెరాస ఎమ్మెల్యే.. క్లాస్ పీకిన హరీష్

సోమవారం, 17 జులై 2017 (15:19 IST)

Widgets Magazine
Muttireddy Yadagiri Reddy

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ దేశవ్యాప్తంగా జరిగింది. ఇందులోభాగంగా, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలాగే, తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. 
 
అయితే, పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బ్యాలెట్ పేపరు పట్టుకుని బూత్ నుంచి బయటకు వచ్చారు. ఓటు ఎక్కడ వేయాలంటూ అడిగారు.
 
దీంతో పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను దగ్గరకి పిలిచి క్లాస్ పీకారు. ఓటు ఎలా వేయాలో ఇంతకుముందే చెప్పినప్పటికీ... ఇదేంటని హరీష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా... తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా ముఖ్యమంత్రికే వివరణ ఇవ్వాలని కోపంగా చెప్పారు. దీంతో ఆయన మరోమాట మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్వీటీని చూసి సంబరపడిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్...

స్వీటీని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సంబరపడిపోయారు. స్వీటి అనగానే బాహుబలి అనుష్క ...

news

అలా అయితే.. ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఫైర్‌బ్రాండ్‍!

ఆర్కే. రోజా. సినీనటి. ప్రస్తుతం వైకాపా తరపున నగరి శాసనసభ సభ్యురాలు. ఆమె పేరు వింటేనే ...

news

రూ.2 కోట్ల లంచంతో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు.. లీక్ చేసిన జైళ్ళ డీఐజీపై బదిలీ వేటు

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షపడి బెంగుళూరు సెంట్రల్ శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...

news

పెళ్లికాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్లుంది?: ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య విముఖత

తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ...

Widgets Magazine