గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : గురువారం, 21 మే 2015 (17:49 IST)

ప్రైవేటు పాఠశాలలకూ ప్రభుత్వ సిలబస్సే... టీ సర్కార్ స్పష్టం

ఇక నుంచి  ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ సిలబస్‌నే అనుసరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వ ముద్రిత పాఠ్య పుస్తకాలనే ఉపయోగించాలని పేర్కొంది. చాలా పాఠశాలలు డైనమిక్, ఇంటిగ్రేటెడ్ కర్రిక్యులమ్‌తో విద్యాబోధన చేపడుతున్నాయి. టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు మినహా, ఇతర పరీక్షలన్నీ సొంత పంథాలో నిర్వహిస్తున్నారు. 
 
ఎస్ఎస్‌సీ బోర్డు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలు పంపుతున్నా, వాటిని పక్కనబెట్టి, ప్రైవేటు పాఠశాలలు వారి సొంత ప్రశ్నా పత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. స్టేట్ సిలబస్ ప్రమాణాల పరంగా ఏమంత మెరుగైనది కాదన్నది అత్యధిక ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల నిశ్చిత అభిప్రాయం. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని తెలంగాణ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. సర్కార్ ఆదేశాలను పక్కన పెడితే సదరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని విద్యా శాఖ అధికారులు తేల్చి చెప్పారు.