గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (12:57 IST)

ఇంటర్నెల్ మార్కులు తక్కువ వేశారనీ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి!

కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో పని చేసే ఓ ప్రొఫెసర్‌పై ఆ వర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడి ఎందుకు చేశారంటే.. ఇంటర్నెల్ మార్కులను తక్కువ వేసినందుకట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. 
 
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో ఆంగ్ల విభాగాధిపతిగా పీవీ లక్ష్మీప్రసాద్ పని చేస్తున్నారు. ఈయన ఉద్దేశ్యపూర్వకంగా ఇంటర్నల్ మార్కులు తగ్గించారని ఆరోపిస్తూ విద్యార్థులు దాడికి దిగారు. ఈ దాడిలో లక్ష్మీప్రసాద్ గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన అధ్యాపక బృందం నిరసనకు దిగింది. 
 
అదే సమయంలో విద్యార్థులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని వర్సిటీ గేటు ముందు నిరసనకు దిగారు. విద్యార్థులు, అధ్యాపకుల పోటాపోటీ నిరసనలతో నిన్న శాతవాహన వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులపై కక్ష పెంచుకునే ఈ విధంగా చేశారంటూ వారు మండిపడుతున్నారు.