శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (20:11 IST)

యాదగిరిగుట్ట వద్ద వ్యభిచారం... పోలీసుల తనిఖీల్లో గుట్టు రట్టు...

వ్యభిచారులు విషయంలో కామాతురాణాం నభయం నలజ్జ అనే సంగతి వర్తించదు కదా. అందువల్ల వారు ఏ ప్రదేశాన్నయినా కామవాంఛ తీర్చుకునేందుకు వాడుకుంటారు. తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి వేరే ప్రదేశాలేవీ లేనట్టుగా పవిత్రమైన పుణ్యక్షేత్రాలను కొందరు ఎంచుకుంటున్నారు. తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలోని లాడ్జ్‌లు, హోటళ్ళలో భారీ స్థాయిలో వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది.
 
యాదగిరి గుట్టపై ఉన్న లాడ్జీలు, హోటల్స్‌లలో ఆకస్మిక తనఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 15 ప్రేమ జంటలను, పలువురు మహిళలు, విటులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 
 
ప్రేమ జంటలకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా, వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నారు. అలాగే, లాడ్జీలు, హోటల్స్‌లలో పట్టుబడిన మహిళలు, విటులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇటీవలి కాలంలో గుట్టపై ప్రేమజంటలు పెరిగిపోయాయని, వ్యభిచారం కూడా జరుగుతోందని పలు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.