గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (12:05 IST)

పీవీ సింధుకు ఘన స్వాగతం : గచ్చిబౌలి స్టేడియంలో సన్మానం..

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటుకుని రజత పతకంతో నగరానికి వచ్చిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియంకు ప్రారంభమైన విజయోత్సవ ర్

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటుకుని రజత పతకంతో నగరానికి వచ్చిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియంకు ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీలో అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. 
 
విద్యార్థులు, అభిమానులు, పలువురు క్రీడాకారులు పువ్వులు చల్లుతూ సింధు.. సింధు అంటూ కేరింతలు కొట్టారు. దారిపోడవునా డప్పు వాయిద్యాలతో, సాంస్కృతిక నృత్యాలతో వెల్ కమ్ నినాదాలు చేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ నుంచి సింధుపై పూల వర్షం కురిపించారు. 
 
గచ్చిబౌలి స్టేడియంలో సింధుకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు సన్మానం చేయనున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సింధు ప్రయాణిస్తున్న బస్సుకు ముందు, వెనుకవైపున భారీ ఎత్తున అభిమానులు జాతీయ జెండాలు, బెలూన్లతో ద్విచక్రవాహనాలపై ముందుకు తీసుకెళ్తున్నారు. 
 
సింధు వెళ్లే మార్గంలో దారి పొడవునా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలు ఊపుతూ సింధు వెల్‌కమ్ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్, రాజేంద్రనగర్, ఆరంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలీచౌక్ మీదుగా గచ్చిబౌలీ వరకు ఊరేగింపు జరిగింది.