మాట్రీమోనీ మోసం.. డాక్టర్‌ అని.. డబ్బు గుంజేశాడు.. హైదరాబాద్ వస్తానని?

marriage
Last Updated: బుధవారం, 5 డిశెంబరు 2018 (12:18 IST)
మాట్రీమోనీ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదుకు చెందిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్‌గా పరిచయం చేసుకుని.. అతనిని నమ్మి మోసపోయింది ఓ బాధితురాలు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ మహిళల వివాహం కోసం షాదీకామ్‌ను ఆశ్రయించింది.  కొన్ని రోజులకు ఆమెకు వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. 
 
తన పేరు ఆయుష్ త్యాగి అని గ్రేటర్ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని.. తాను హైదరాబాదుకు వచ్చి అక్కడే స్థిరపడి క్లినిక్ పెట్టుకోవాలనుకుంటున్నానని.. ఇష్టపడితే వివాహం చేసుకుందామని ఆ వాట్సాప్ సందేశంలో వుంది. దీన్ని నమ్మిన సదరు యువతి అతనిని వివాహం చేసుకునేందుకు సై అంది. కానీ హైదరాబాద్ వస్తానని చెప్పిన త్యాగి.. కస్టమ్స్ దొరికిపోయాడని.. మనీలాండరింగ్‌ కేసులో పట్టుబడ్డాడని చెప్పింది. కస్టమ్స్ క్లియరెన్స్ కావాలంటే.. రూ.5.45 లక్షలు చెల్లించాలని చెప్పింది. 
 
ఆ మాటలు నమ్మిన బాధితురాలు పూజ.. చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు పంపింది. కానీ ఆ తర్వాత త్యాగి ఫోన్ ఎంత ట్రై చేసినా కలవకపోవడంతో.. జరిగిందంతా మోసమని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు త్యాగి బండారం బయటపెట్టారు. అతడి అసలు పేరు అబేద్ (30) అని, అతడు ఓ నైజీరియన్ అని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అతని వద్ద వున్న ఎలక్ట్రానిక్ ఉపరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత చదవండి :