గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: శుక్రవారం, 25 జులై 2014 (20:09 IST)

విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించిన తెలంగాణ డిప్యూటీ సీఎం

మెదక్ జిల్లా మాసాయి పేట వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లిదండ్రులను తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య పరామర్శించారు. మెదక్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 
 
మొత్తం 20 మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 13 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఏడుగురు చిన్నారులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్సనందిస్తున్నారు. మరో ఏడుగురి పరిస్థితి నిలకడగా వుంది. ఈ ఉదయం తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించారు
 
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులనడిగి తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థులకు అందిస్తున్న చికిత్సలపై సరైన వివరాలుచెప్పడంలేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కన్నబిడ్డలు పడుతున్న వేదనను అర్థం చేసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.