Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా బాస్‌లు పేకాటాడుతూ పోలీసులకు చిక్కారు... మీడియాతో సిబ్బంది

గురువారం, 6 జులై 2017 (14:13 IST)

Widgets Magazine
playing cards

ప్రజలకు జవాబుదారీగా ఉండి, క్రిందిస్థాయి ఉద్యోగులను ముందుండి నడిపించాల్సిన ఒక అధికారి పెడదారి పట్టాడు. తన సహ ఉద్యోగులతో కలిసి పేకాట ఆడారు. అది కూడా విధుల్లో ఉండాల్సిన సమయంలోనే. ఇప్పటికే సుపరిపాలన అందించాలన్న ధ్యేయంతో ఉన్న కెసిఆర్‌కు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తుల కారణంగా చెడ్డ పేరు వస్తోంది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన పేకాట సంఘటన చర్చనీయాంశంగా మారుతోంది. 
 
ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరోవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
 
వీరంతా సదరు ఆర్డీవో ఫాంహౌస్‌లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు పట్టుబడ్డ విషయం బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసే సిబ్బందే ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబాయ్... తప్పుచేశాం.. మొహం చూపించడం సిగ్గుగా ఉంది... అందుకే చచ్చిపోతున్నాం...

పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ విషయం నలుగురికి తెలియడంతో ఇంటినుంచి లేచిపోయి ...

news

ఆమెకు 45 - అతడికి 25.. వివాహేతర బంధం : పెళ్లికి అడ్డుతగులుతుందనీ కర్రతో కొట్టి చంపేశాడు

పట్టుమని పాతికేళ్ల కూడా నిండని కుర్రాడితో 45 ఏళ్ల మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆమె ...

news

ఫ్లైట్‌లో కిటికీ పక్క సీటులో మహిళ.. వెనుక సీట్లో కూర్చొని 'అక్కడ' తాకిన ప్రయాణికుడు

మహిళలపై భూమిపైనే కాదు.. నింగిలోనూ భద్రత లేకుండా పోయింది. విమానంలో కిటికీ పక్క సీట్లో ...

news

పులికి ఆహారమైపో! వృద్ధులను అడవుల్లోకి పంపుతున్న కొడుకులు.. ఎక్కడ?

కాటికి కాళ్లు చాపిన వయసులో తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వృద్ధులను కొందరు కొడుకులు ...

Widgets Magazine