Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూది మందంటే చచ్చేంత భయమంటున్న సీఎం సాబ్ ఎవరు?

శనివారం, 8 జులై 2017 (16:03 IST)

Widgets Magazine

ఆయన ఒక పార్టీకి అధినేత. రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందరో రాజకీయ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన నేత. కానీ, సూది మందంటే చచ్చేంత భయం. ఈ విషయం ఇప్పటికీ ఆయన ఇంట్లోవారికి తెలియదట. ఆ సీఎం సాబ్ ఎవరో కాదు... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తనకు సూది మందంటే చచ్చేంత భయమో ఆయన పూసగుచ్చినట్టు వివరించారు. ఈ మాటలు విన్న నేతలతో పాటు అధికారులు పగలబడినవ్వారు. 
 
సీఎం కేసీఆర్‌కు కంటిలో శుక్లాలు వచ్చాయని, ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చేరి ప్రాథమిక వైద్య పరీక్షలు కూడా చేశారు. రెండుసార్లు ఆపరేషన్ కోసం వెళ్లిన ఆయన 2 సార్లూ వాయిదా వేసుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. తొలుత అమెరికా నుంచి వైద్యుడు సకాలంలో రాలేదన్న సాకుతో ఆపరేషన్ తప్పించుకున్నారు. రెండోసారి రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తున్నారని, ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చూడాలన్న నెపంతో హైదరాబాద్ వచ్చారు. 
 
అయితే వాస్తవానికి ఆపరేషన్‌ను తప్పించుకునేందుకు అసలు కారణాలు అవి కాదని కేసీఆర్ స్వయంగా పార్టీ ఎంపీలతో చెప్పడం విశేషం. తనకు సూది మందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని... సూది మందు వేస్తారని చెప్పడంతోనే తాను ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నానని తెలిపారట. 
 
ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని, 'ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి, చెబితే ఈసారి బలవంతంగా ఆపరేషన్ చేయిస్తార'ని కూడా ఆయన నవ్వుతూ అన్నారట. దీంతో మిగిలిన నేతలంతా పగలబడి నవ్వారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జాతీయ జెండాను రివర్స్‌ ఎగిరేసిన కలెక్టర్...

ఒక జిల్లా కలెక్టరే జాతీయ జెండాను అవమానించారు. దేశసార్వభూమాధికారాన్ని ప్రజలందరికీ ...

news

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. ...

news

మా భర్తలు తాగాలి... వైన్ షాప్ ఇక్కడే ఉంచండి...!

భర్త రోజు తాగొచ్చి గొడవ చేస్తే దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదు. మద్యం సేవించే భర్త అంటే ...

news

ఆప్ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.. అసెంబ్లీలోనే కానిచ్చేశారు...

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు ...

Widgets Magazine