Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంత తప్ప రాష్ట్రంలో ఇంకెవ్వరూ కనిపించలేదా? చెప్పులతో కొట్టే రోజులు?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (09:34 IST)

Widgets Magazine
samantha-ktr

చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత తప్ప రాష్ట్రంలో ఇంకెవ్వరూ కనిపించలేదా? అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కరీంనగర్‌ సభలో కేటీఆర్‌ తన స్థాయి మరిచి మాట్లాడారని, తెలంగాణ ఆకాంక్షలను కాలరాస్తూ టీఆర్‌ఎస్‌ సర్కారు సాగిస్తున్న పాలన వల్ల ప్రజలు వారినే చెప్పులతో కొట్టే రోజులు దగ్గరికొచ్చాయని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు. 
 
మంత్రి కేటీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతను పరిరక్షించే ఉద్యమం కొత్తగా చేపట్టడమే విడ్డూరంగా ఉందని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆయనకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఇంతటితో చాలదన్నట్లు సినీ నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడమేమిటని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ఆడపడుచులను అవమానపర్చడమేనన్నారు. 
 
బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలంగాణ అమ్మాయిలు పనికిరారా అని ప్రశ్నించారు. సమంత సినీ నటుడు అక్కినేని నాగార్జునకు కాబోయే కోడలని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను 15 రోజుల్లో కూల్చివేస్తామని ప్రగల్భాలు పలికిన విషయం మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. ఇదంతా లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే జరుగుతోందని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Samantha Nagarjuna Ktr Shocking Comments Shabbir Ali

Loading comments ...

తెలుగు వార్తలు

news

పళని వద్దు.. పన్నీరే ముద్దు.. చిన్నమ్మకు జైలులో కంపెనీ ఇస్తున్న పళని బంధువు..?

తమిళనాడు సీఎం అభ్యర్థిగా శశికళ వర్గంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి బంధువులు తక్కువేం తినలేదు. ...

news

అప్పుడు జయను చెన్నారెడ్డి... ఇప్పుడు శశికళను విద్యాసాగర్ రావు...

తెలుగు నాట సంభవించే రాజకీయ సంక్షోభాలకు, తెలుగు గవర్నర్లకు విడదీయరాని సంబంధం ఉంది. దేశ ...

ప్రపంచాన్ని ఇంకా వదలని హిట్లర్ భూతం: ఆస్ట్రియాలో అరెస్ట్‌

రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై నాడు ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత అడాల్ఫ్‌ ...

news

హమ్మయ్య.. పీడ విరగడైంది.. అమ్మ ఆత్మ పన్నీరు వెంటే.. శశికి సపోర్ట్ చేస్తే అంతే సంగతులు..

తమిళనాడు ప్రజలు చిన్నమ్మ అంటేనే గుర్రుగా ఉన్నారు. అమ్మ మరణంపై ఆమె వ్యవహరించిన తీరే ఇందుకు ...

Widgets Magazine