శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (15:46 IST)

హైదరాబాద్‌లో లేడీ టెక్కీ దారుణ హత్య..!

హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. కొద్ది రోజుల క్రితమే వివాహం జరిగిన అనూష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం సోమవారం ఉదయం బయటపడింది. 
 
హైదరాబాద్‌లోని సోమాజీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో ఆ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ఎవరు హత్య చేసి వుంటారన్న అంశం మీద పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.