మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (12:41 IST)

ముస్లింల కోసం ప్రత్యేక మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలు : డిప్యూటీ సీఎం

ముస్లింల కోసం ప్రత్యేక మ్యారేజ్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు  తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మొదటి కౌన్సిలింగ్ కేంద్రాన్ని నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన దంపతుల మధ్య తలెత్తే వివాహ, కుటుంబ వివాదాలను ముస్లిం పర్సనల్ లా ప్రకారం పరిష్కరించేందుకు ఈ కేంద్రాలు పనికొస్తాయన్నారు. కౌన్సిలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
 
న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న మహిళలకు మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌ కేంద్రాలు సత్వర న్యాయం పొందేందుకు సహకరిస్తాయని మహమూద్ అలీ పేర్కొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి ఈ. ఇస్మాయిల్‌ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ కేంద్రాల్లో సేవలందిస్తారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.