శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:46 IST)

అది చీప్ లిక్కర్ కాదు.. సబ్సీడీ మద్యం : స్వామిగౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్‌ను సబ్సీడీ మద్యం అని పిలవాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకే ప్రభుత్వం చీప్ లిక్కర్‌ను ప్రవేశపెడుతోందన్నారు. పైగా, ప్రజా సంక్షేమం కోసమే ఈ తరహా మద్యాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. 
 
ప్రభుత్వం మద్యాన్ని సబ్సిడీపై సరఫరా చేస్తుంటే దానికి చీప్ లిక్కర్ అని పేరు పెట్టడం తప్పని అభిప్రాయపడ్డారు. అది చీప్ లిక్కర్ కాదు. సబ్సిడీ మద్యం అని పిలవాలన్నారు. గుడుంబా, నాటు సారాలు విషపదార్ధాలని, వాటిని ఆపేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.