గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:31 IST)

ట్యాంక్ బండ్‌ రహదారి 10 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చర్యల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ రహదారిని పది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేశారు. బుద్ధభవన్‌ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రోడ్డును బ్లాక్‌ చేశారు. వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద పెద్ద గుంతకు మరమ్మత్తులు చేసి అక్కడి నుంచి నెక్లెస్‌రోడ్డు వైపు పనులు ప్రారంభించారు.
 
అలాగే, కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే పైపును తిరిగి తీసివేసి నూతన పైపును వేసేందుకు మూడు కిలోమీటర్ల మేర భారీ సొరంగాన్ని తవ్వనున్నారు. దీని ద్వారా భారీ పైప్‌లైన్‌ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో సిబ్బంది 10 రోజుల పాటు ఈ పనులను చేయనున్నారు. 
 
సికింద్రాబాద్‌ నుంచి రాణిగంజ్‌ వైపు అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడీగూడ వైపు మళ్లించారు. లక్షకుపైగా వాహనాలు ట్యాంక్‌బండ్‌ రోడ్డుపై రాకపోకలు జరుగనున్న నేపథ్యంలో 10 రోజుల పాటు మార్గాన్ని మూసివేయడం ద్వారా తీవ్రంగా ట్రాఫిక్‌ సమస్యలు కలిగే అవకాశం ఉంది. ట్యాంక్‌బండ్‌ మూసివేతపై ముందస్తు సమాచారం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.